ప్రతి పాఠశాల 100 % శాతం ఉత్తీర్ణత సాధించాలి : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • ఆర్.కె.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పది’ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ లోని జడ్.పి.హెచ్.ఎస్, మక్త మహబూబ్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకంగా ముద్రించబడిన ఇంగ్లీష్, తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదివి ప్రతి స్కూల్లోనూ 100% ఉత్తీర్ణులు అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఈ స్టడీ మెటీరియల్ ను అందజేస్తున్నట్లు తెలిపారు.

మియాపూర్ డివిజన్ లోని జడ్.పి.హెచ్.ఎస్, మక్త మహబూబ్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాలలో జెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆర్ కే వై ఫౌండేషన్ ద్వారా ఈ స్టడీ మెటీరియల్ ని ఉచితంగా అందజేస్తామని , మీరందరూ ఎంత బాగా చదువుకుంటే అంత గొప్ప వారవుతారని పేర్కొన్నారు. పదవతరగతి భవిష్యత్తు కు పునాదిలాంటిదని , అందరూ బాగా చదివి పాస్ అయ్యి మీ తల్లిదండ్రులను సంతోషపరచాలని, మీరందరూ పాస్ అయితేనే తమకు ఆనందంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాగుల్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, ఏల్లేశ్, రమేష్, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీను.జే, రాము.జే, రామకృష్ణ , శ్రీనివాస్ , పాల్గొన్నారు.

‘పది’ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here