హెచ్ పి వి వ్యాక్సిన్ తో గర్భాశయ క్యాన్సర్ దూరం

  • 9-14 వయస్సు గల బాలికల కోసం సిఫారసు
  • మాతృశ్రీ నగర్ కళాశాలలో అంతర్జాతీయ హెచ్ పి వి వ్యాక్సిన్ అవగాహనా దినోత్సవం
  • హెచ్ పి వి వ్యాక్సిన్ ఆవశ్యకతపై విద్యార్థినులకు వివరించిన గాలెన్ హాస్పిటల్ వైద్య బృందం
హెచ్ పి వి వ్యాక్సిన్ ఆవశ్యకతపై విద్యార్థినులకు వివరిస్తున్న గాలెన్ హాస్పిటల్ వైద్య బృందం

నమస్తే శేరిలింగంపల్లి: ముందస్తుగా గుర్తించకుంటే క్యాన్సర్ వ్యాధి మనిషి ప్రాణాలకే ప్రాణాంతకం… అంతేకాక సామాజికంగా, ఆర్థికంగా పేషంట్ కు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాధిని సరైన సమయంలో (వ్యాధి మొదటి దశలో ఉన్నపుడు) గుర్తిస్తే దానిని సమూలంగా అరికట్టవచ్చని గాలెన్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు లాస్య అన్నారు. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ హెచ్ పి వి అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృశ్రీ నగర్ కళాశాలలో విద్యార్థినులకు హెచ్ పి వి వ్యాక్సిన్ పట్ల ప్రత్యేకంగా అవగాహన కలిపించారు.
హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా మహిళలలో గర్భాశయ క్యాన్సర్ వస్తుందనేది వైద్య శాస్త్ర పరంగా తేలిందని, గర్భాశయ క్యాన్సర్ ను రాకుండా చేసేందుకు హెచ్ పి వి వ్యాక్సిన్ నేడు అందుబాటులోకి వచ్చిందని, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఏజిఐ) యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా 9-14 సంవత్సరాల వయస్సు గల యుక్త వయస్సు బాలికలకు అందించాలని సిఫారసు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో 4వ అత్యంత సాధారణ క్యాన్సర్ గా పేర్కొనవచ్చని, భారతదేశంలో, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ అని పేర్కొన్నారు.

కన్సల్టెంట్ ఫామిలీ ఫిజీషియన్ డా. స్వాతి యలవర్తి, మాట్లాడుతూ హెచ్ పి వి వైరస్ కారణంగా వస్తున్న గర్భాశయ క్యాన్సర్ ను రాకుండా అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర వేత్తలు చేసిన కృషి ఫలితంగా హెచ్ పి వి నివారణ వ్యాక్సిన్ ఆవిష్కరించబడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ వేసుకొన్న వారికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. 9-14 ఏండ్ల మధ్య వయస్సు బాలికలు వైద్యులు నిర్ధేశించిన ప్రకారం అధికారికంగా ఆమోదించబడిన హెచ్ పి వి వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

మాతృశ్రీ నగర్ కళాశాల విద్యార్థినులతో గాలెన్ హాస్పిటల్ వైద్య బృందం

గాలెన్ హాస్పిటల్ డైరెక్టర్ నిరుపమ మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ ను తమ హాస్పిటల్ ద్వారా అందరికీ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ కావాలనుకొనే వారు ముందస్తుగా తమను సంప్రదిస్తే వైద్యులు సూచన మేరకు వారికి అందుబాటైన ధరలలో అందిస్తామని వివరించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని సోమవారం 6 నుంచి 11వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గాలెన్ హాస్పిటల్ మియాపూర్ డైరెక్టర్ జి పద్మజ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డా. రామ కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here