- ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంసిపిఐ యు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ డిమాండ్ చేశారు. మియాపూర్ చౌరస్తాలో ఎం సిపిఐ యు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం రూ. 400 రూపాయలు ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను రోజురోజుకు పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా వంట గ్యాస్ ధర రూ. 1176.50లకు పెరిగిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ విధానం చూస్తుంటే మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి పై వంట చేసి కన్నీరు తెచ్చేలా ఉందనన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరకు తగ్గించే వరకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఇ.దశరథ నాయక్, తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి మియాపూర్ డివిజన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్ సభ్యులు ఎం చందర్, కె.జయలక్ష్మి, డి లక్ష్మీ, జి.లలిత, జి శివాని, ఎం రాణి, తుడుం పుష్పలత ,అమీనా బేగం, అప్సర బేగం, జంగన్న, ఇసాక్, గాలయ్య పాల్గొన్నారు.