100% ఉత్తీర్ణులయ్యేలా సన్నద్ధమవ్వాలి : బిజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

  • పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ మసీద్ బండలోని జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో  టెన్త్ క్లాస్ విద్యార్థినీ విద్యార్థుల కోసం బిజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ ప్రత్యేకంగా ముద్రించబడిన స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులవ్వాలని, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో నిపుణులైన ప్రొఫెసర్ల సమక్షంలో స్టడీ మెటీరియల్ ముద్రణ చేయించినట్లు తెలిపారు.

పదో తరగతి విద్యార్థులకు  ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందజేస్తున్న బిజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

ఈ స్టడీ మెటీరియల్ వల్ల మీరు అందరూ పరీక్షలకు సన్నద్ధం కావడం చాలా సులభతరం అవుతుందని, విద్యార్థులందరూ బాగా చదివి ప్రతి స్కూల్లోనూ 100% ఉత్తీర్ణులు అవ్వాలని కోరారు.  శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆర్ కే వై ఫౌండేషన్ ద్వారా ఈ స్టడీ మెటీరియల్ ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంత రెడ్డి, గంగాధర్ రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్ ,రమేష్, నరసింహ,  శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్, ఉపాధ్యయులు పాల్గొన్నారు.

మసీద్ బండలోని జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో రవి కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here