నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేశామని, కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
మయూరి నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులను, సమస్యలను పరిశీలించామని, కాలని వాసులకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బిఅర్ఏస్ నాయకులు, చంద్రిక ప్రసాద్, సోమేశ్వర రెడ్డి, జంగిర్, అశోక్, శివ, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షుడు నారాయణరావు, రామరాజు, నరసింహ రాజు, రంగరాజు, బాబ్జీ రాజు, మిరజ్ , విక్రమ్, వెంకట్, హరిబాబు పాల్గొన్నారు.