నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సిద్దిక్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిక్ నగర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిక్ నగర్ బస్తి కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు బసవరాజ్, ప్రధాన కార్యదర్శి ఎం. గణేష్, కోశాధికారి ఎస్. రాము అదేవిధంగా సిద్దిక్ నగర్ ఎల్లమ్మ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు బాదం భాస్కర్ ప్రధాన కార్యదర్శి ఉప్పులూరి సాగర్ చౌదరి, కోశాధికారి కే వెంకటేష్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుడుగు తిరుపతిరెడ్డి, యాదయ్య గౌడ్, హనుమంత చారి, రవీందర్ రెడ్డి, గణపతి, ఎం శ్రీనివాస్, తిరుపతి, స్వామి, కిషోర్ పాల్గొన్నారు.