- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ లో స్థానిక నాయకులు, ప్రజలతో కలసి పర్యటించారు. బస్తీలో నెలకొన్న ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి పాదయాత్ర చేశామని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు.
డ్రైనేజీ వాటర్ మంజీరా నీళ్లలో కలుస్తుందని స్థానికులు తెలుపగా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు మధ్యలో ఉన్న హైమాస్ లైట్ల స్తంభం వల్ల ఇబ్బందులు ఉన్నాయని, దానిని తొలగించాలని స్థానికులు కోరగా, సంబంధిత అధికారులతో మాట్లాడి, తొలగించే ఏర్పాటు చేస్తామని అన్నారు. కొన్ని రోజులు క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు పడిన ప్రజలను కలవటం జరిగిందని, జీహెచ్ఎంసి సిబ్బంది, అధికారులతో కలసి సత్వర పరిష్కార చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. బస్తీలో వర్షపు నీరు సులభంగా పోవటానికి సహాయక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తక్షణ సహాయక చర్యలు తీసుకోవటానికి ముందస్తుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట మస్తాన్ నగర్ తెరాస ఇంచార్జ్ దామోదర్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, రాజు, రామారావు, మహిపాల్ యాదవ్, సాయి, రాములు, బుజ్జమ్మ, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.