- గుడిసెల తొలగింపును అడ్డుకోవడంపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జి.పి.ఆర్.ఏ క్వార్టర్స్ లో కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్న వారిని జి హెచ్ఎంసి అధికారులు అక్రమంగా గుడిసెల తొలగింపును అడ్డుకోవడానికి వెళ్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని గోపన్ పల్లి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీన్ని ఖండిస్తూ ఆయన మాట్లాడుతూ పేదలను నడి రోడ్డు మీద వేయడం అధికారులకు తగదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటు ఏర్పరచుకున్న స్థిర నివాసాలను, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అమానుషం అన్నారు. నిరుపేదల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అధికారపార్టీ వారి అదేశాలతోనే ఇలా ఏదో ఒక కారణం చెప్తూ పెద్దవారి పై ప్రతాపం చూపెట్టడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు, శేకర్, మూర్గ రంగస్వామి ముదిరాజ్, చిన్న, టింకు, విష్ణు, క్రాంతి, నర్సింగ్ రావు పాల్గొన్నారు.