- కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్
- పోలీసు నిర్బంధంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ జిపిఆర్ ఎ క్వాటర్స్ లో తెల్లవారు జాము నుంచే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పొట్ట కోటి కోసం నగరానికి వచ్చి రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద ప్రజలపై జిహెచ్ఎంసి అధికారులు తమ జులుం ప్రదర్శించారు. గుడిసెలు తొలగిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బాజాపా నాయకులు రవికుమార్ యాదవ్ సంఘటన స్థలానికి వెళ్లి కూల్చివేతను అడ్డుకోగా వారిని అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని కాలం వెళ్లబోస్తున్న కటిక పేదలపై కక్షపూరితంగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గుడిసెలను ఇష్టారాజ్యంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ , ఈ పేదవారికి ఆ గుడిసెలపై కరెంటు బిల్లు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అన్ని హక్కులను కల్పించి ఇప్పుడు మధ్యంతరంగా గుడిసెలను తొలగించి రోడ్డుపాలు చేయడం సబబు కాదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని లేదా ప్రత్యామ్నాయ స్థలం చూయించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి పేదవారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అండదండలతో మొన్న బసవతారక నగర్ , మసీదు బండ వడ్డెర బస్తి , స్టాలిన్ నగర్ ఇలా అనేక ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజల గుడిసెలను తొలగించి వారిని రోడ్డున పడవేశారని తెలియజేస్తూ ప్రతి పేదవాడికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ వచ్చే విధంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న నాయకులను పరామర్శించడానికి వచ్చిన శేరిలింగంపల్లి కన్వీనర్ రాఘవేంద్రరావు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , చందానగర్ మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి , నాయకులు హనుమంత్ నాయక్, గణేష్ ముదిరాజ్ , తిరుపతి , వరలక్ష్మి , ఇందిరా, శివ సింగ్, భరత్, లడ్డు యాదవ్, రంగస్వామి, కరణ్ గౌడ్, క్రాంతి, వెళ్ళారు.