ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీ ఆంగ్ల మధ్యమిక పాఠశాలలో పాఠశాల ఎస్ఎంసి కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఛైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ పాఠశాలలోని ప్రతిభకనబరచిన విద్యార్థులను ప్రోత్సాహిస్తూ తనవంతు నగదును చెక్ రూపంలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి భరత్ కుమార్ మరికొంత మంది విద్యార్థులకు అందజేశారు.

విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదును చెక్కు రూపంలో అందజేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
పాఠశాల ఎస్ఎం సి కమిటీ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగం

విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులు మెరుగ్గా విద్యను పొందుతున్నారని, పాఠశాలను అభివృద్ధి పధంలో నడిపిస్తూ తన సొంత నిధితో నడుపుతునందుకు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు వ్యాయామం, స్పోర్ట్స్ నిర్వహించుకునేలా ప్రహరి నిర్మిస్తున్ననందుకు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతున్నందుకు ధన్యవాదములు తెలిపారు. పాఠశాల ఎస్ఎంసి కమిటీ మరికొన్ని అభివృద్ధి పనులను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వారు తక్షణమే స్పందించి అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ పాఠశాల పేదప్రజల పిల్లలలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే ఆలోచనతోని పాఠశాల నిర్మించడం జరిగిందని, అందుకు పాఠశాలలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్బంగా ప్రతి ఒక్కరూ భావితరాలకు మాతృమూర్తిగా ఉండే ఆడపిల్లలను గౌరవించాలని అన్నారు. గర్భంలోనే ఆడపిల్ల అని తెలియగానే దుస్సహాసాలకు పాల్పడుతునందుకు ఖండిస్తూ, ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు ఆడపిల్లలను కాపాడుకుని, అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలను ప్రోత్సహించేలా ఉండాలని అన్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి వరకు ఉన్నందున భవిష్యత్తులో 7వ తరగతి వరకు పెంచే కార్యక్రమం చేస్తానని, అలాగే విద్యార్థుల సంఖ్య దినదిన పెరుగుతున్నందున ఉపాధ్యాయులను, వాలంటరీ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎస్ఎంసి ఛైర్మెన్ బస్వరాజ్ లింగయత్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వైస్ ఛైర్మెన్ సుమలత, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దేవదాసు, అధ్యాపకులు అశ్రఫ్, ఆంజనేయులు, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సురభి కాలనీ యూత్ ప్రెసిడెంట్ భాను, పాపిరెడ్డికాలనీ బస్తీ అధ్యక్షుడు సాయినందన్ ముదిరాజ్, ఎస్ఎంసి కమిటీ మెంబర్స్, పాఠశాల స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here