- కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్‌లో స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు నూతన పైప్ లైన్ పనులు చేపట్టాలని అధికారులను కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. ఆయన దిశానిర్దేశం మేరకు మాదాపూర్ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, వార్డ్ సభ్యుడు రహీం, ఆదిత్య నగర్ తెరాస బస్తీ కమిటీ అధ్యక్షుడు ఖాసీం, నాయకులు బాబూమియా, లియాకత్, సలీం, మియాన్, గౌస్, జాఫర్, ముసా, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.