కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీ వద్ద ముంపుకు గురైన ప్రాంతాన్ని GHMC అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. కాలనీలో సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు EE వెంకటేశ్వర్లు, DE శ్రీనివాస్, AE కృష్ణ వేణి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, వార్డ్ మెంబర్ నరేష్, జగదీష్, సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.