నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ బిక్షపతి ఎంక్లేవ్ దగ్గర సంక్రాంతి పండుగ సందర్భంగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీల నిర్వహణ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడం భారతీయ సనాతన సంప్రదాయం అన్నారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా విజయలక్ష్మి, టి. వరలక్ష్మి వ్యవహరించారు. స్థానిక మహిళా నాయకురాళ్ళు మెర్సీ, శోభ, శ్రీదేవి, త్రివేణి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మల్లేష్, జనార్ధన్ పాల్గొన్నారు.