హకీ క్రీడాకారిణి జ్యోతిరెడ్డికి సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి హకీ క్రీడాకారిణి జ్యోతి రెడ్డి స్పోర్ట్ కోటాలో రైల్వే లో ఉద్యోగం రావడం మిగతా క్రీడాకారులకు ఎంతో స్పూర్తి నిచ్చిందని ద్రోణాచార్య ఆవార్డు గ్రహీత , జాతీయ అథ్లెట్ శిక్షకుడు నాగపూరి రమేశ్ తెలిపారు. తెలంగాణ హకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆద్వర్యంలో చందానగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో రమేశ్ తో పాటు క్రీడాకారిణి జ్యోతి రెడ్డిని సన్మానించారు. ఈ సందర్బంగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్, హకీ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ హకీ జూనియర్ ఇండియా టీంలో రంగారెడ్డి నుండి స్థాన సంపాదించి తన క్రీడ నైపుణ్యం చూపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం చూపించి క్రీడ కోటాలో ఉద్యోగం సాదించడం మిగతా క్రీడాకారులకు స్పూర్తిగా జ్యోతి నిలవడం గొప్ప విషయమని పేర్కొన్మారు . ఈ కార్యక్రమంలో హకీ తెలంగాణ ట్రెజరర్ భాస్కర్ రెడ్డి, హకీ రంగారెడ్డి ఉపాద్యక్షుడు రెడ్డి ప్రవీణ్ రెడ్డి , త్రివేణి స్కూల్స్ డైరక్టర్ సుబ్బారావు, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

హకీ క్రీడాకారిణి జ్యోతిరెడ్డి, ద్రోణాచార్య ఆవార్డు గ్రహీత , జాతీయ అథ్లెట్ శిక్షకుడు నాగపూరి రమేశ్ ను సన్మానిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here