- పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- జనవరిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడలో 263.09 కోట్ల రూపాయల అంచనావ్యయంతో 3 KM నూతనంగా చేపడుతున్న గ్రేడ్ సపరేటర్ ఫ్లై ఓవర్ పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కొత్తగూడలో 263.09 కోట్ల రూపాయల అంచనావ్యయంతో 3 KM నూతనంగా చేపడుతున్న గ్రేడ్ సపరేటర్ ఫ్లై ఓవర్ పనులు దాదాపుగా పూర్తి స్థాయిలోకి వచ్చాయని, తుది దశలో ఉన్నవని, నూతన సంవత్సరంలో మొదటి వారంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల పరిసర ప్రాంతలలో పెద్ద పెద్ద భవనాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, షాపింగ్ మాల్స్ ఉండటం వల్ల వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని, ఈ ఫ్లై ఓవర్ తో ఆ కష్టాలు తీరనున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ,ప్రజల ట్రాఫిక్ సమస్యల ఇబ్బందులను గట్టెకించే విధంగా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీకాంతిని, DE స్రవంతి, AE ప్రశాంత్, బోస్ పాల్గొన్నారు.