ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం..

  • శేరిలింగంపల్లి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతాం
  • ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
ఓల్డ్ హఫీజ్ పెట్ ప్రభుత్వ దవాఖానలో ఏఎన్ఎం లకు యూనిఫామ్ (దుస్తులను)పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే రోగులు భయపడేవారని, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రైవేటు దవాఖాన వద్దు..సర్కార్‌ దవాఖానే ముద్దు అనే స్థాయిలో ప్రజల్లో మార్పు వచ్చిందంటే వైద్య ఆరోగ్య శాఖ ఎంత మెరుగైన సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ ప్రభుత్వ దవాఖానలో ఏఎన్ఎం లకు నూతన యూనిఫామ్ (దుస్తులను)పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలనే లక్ష్యంతో దవాఖానకు వచ్చే వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే కాకుండా నిత్యం ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేస్తుండటంతో క్షేత్ర స్థాయినుంచే వైద్య ఆరోగ్య శాఖలో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయన్నారు. అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, గంగారాం గ్రామంలో నూతనంగ మంజూరై చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైప్ లైన్ పనులకు స్థానిక నాయకులు,హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి అధికారులు డి.జి.ఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యంతో కలిసి పనులను ప్రభుత్వ విప్ గాంధీ, హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బలింగ్ గౌతమ్ గౌడ్, అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి, నాయకులు కృష్ణ ముదిరాజ్, హఫీజ్ పెట్ డివిజన్ బి.సి సెల్ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్, కరుణాకర్ గౌడ్, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, రామకృష్ణ గౌడ్, మల్ల రెడ్డి, సంగా రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ ఎస్.సి సెల్ అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్, సంజు, సుదర్శన్, ముజీబ్, సుదేశ్ కుమార్, షేక జామీర్, దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర రావు, నదీమ్, సుధాకర్, రంగారావు, కృష్ణ, చంద్రశేఖర్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ మహిళ కమిటీ అధ్యక్షురాలు షేబన, పర్వీన్, నజియా, లక్ష్మీ, ఫరాజ్, జరీనా, హాలిమ, రష్మీ, సాకేరా పాల్గొన్నారు.

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, గంగారాం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here