- నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలివ్వాలని టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: దీప్తిశ్రీనగర్ పరిధిలోని శాంతినగర్‌లో బససవలింగ మెన్స్ హెయిర్ సెలూన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద యువకులకు స్వయం ఉపాధి కల్పించి ఆదుకోవాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దోహదపడాలని పేర్కొన్నారు. నగరంలో మరిన్ని హెయిర్ సెలూన్లు ఏర్పాటు చేసేలా ఉన్నతంగా ఎదగాలన్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో షాప్ యజమాని జంగయ్య, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.