ప్రశ్నించిన పాపానికి ప్రాణం బలి…

  • కారు వేగానికి రోడ్ పై నిలిచిన నీరు వాహనాలపైకి
  • కారును అడ్డుకొని నిలదీసిన హనదారులు
  • కోపంతో బైకులను ఢీకొట్టిన కార్ యజమాని
  • గాయాలపాలైన మహిళ చికిత్స పొందుతూ మృతి

నమస్తే శేరిలింగంపల్లి: వేగంగా వెళ్తున్న కారు వల్ల రోడ్డు పైన నిల్వ ఉన్న నీరు వాహనదారులపై పండింది. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి కారు నడుపుతున్న వ్యక్తి వారిని ఢీకొట్టాడంతో గాయలపాలై ఓ మహిళ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..  ఎర్రగడ్డలో నివాసం ఉండే సయ్యద్ సైఫుద్దీన్(27) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 19న అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో భార్య మారియా మీర్ (25)తో మాదాపూర్ మీదుగా గచ్చిబౌలి బయల్దేరారు. వారితో పాటు సయ్యద్ మిరాజుద్దీన్, రాషెద్ మాషా ఉన్నారు. నలుగురు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు. వీరు ఆట్రియం మాల్ సమీపం నుండి వెళుతున్న క్రమంలో ఆ పక్కనుండే బెంజ్ కారు (ఏపీ09ఎం 0001) లో వెళ్తున్న జూబ్లీహిల్స్ కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి (26) రోడ్డుపక్కనే నిల్వ ఉన్న నీటిపై నుంచి వేగంగా కారు పోనిచ్చాడు.

రాజసింహా రెడ్డి నడిపిన బెంజ్ కార్ ఇదే

దీంతో సైఫుద్దీన్ సోదరులు ప్రయాణిస్తున్న బైక్ పై నీరు పడింది. దీంతో కారును వెంబడించిన ద్విచక్ర వాహనదారులు బెంజ్ కారు నడుపుతున్న రాజసింహారెడ్డిని అడ్డుకుని నిలదీశారు. కాసేపు వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన కారు నడుపుతున్న వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అలా ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు మరో బైక్ ను సైతం కారుతో ఢీకొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న మారియా వాహనంపై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడి తీవ్ర గాయాలపాలైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలు మారియాకు 8నెలల పాప ఉన్నట్లు ఆమె బంధువులు తెలిపారు. రాయదుర్గం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here