నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో రూ. 1 కోటి 20 ఇరవై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీవాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గోపనపల్లి తండా వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, ముళగిరి శ్రీనివాస్, రాజు, రమేష్, రాజు, రాములు, శేఖర్, ప్రభాకర్, నర్సింగ్ నాయక్, ప్రకాష్ నాయక్, శ్రీను, నందు, పండు రాథోడ్, హనుమ, వేణు, గోవర్ధన్, గోపనపల్లి తండా వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.