నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ లో కార్తీక మాసం సందర్భంగా బాలాంజనేయ స్వామి దేవస్థానంలోని భవాని సమేత ఉమామహేశ్వర స్వామి కళ్యాణం అశేష భక్తజనుల మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ ఛార్జ్ గజ్జల యోగానంద్, విచ్చేసి శివపార్వతుల దర్శనం చేసుకొని భవాని సమేత ఉమామహేశ్వర స్వామి ఆశీర్వాదం పొందారు. ఆలయ కమిటీ సభ్యులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.