నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్, తారా నగర్ , తుల్జా భవాని గుడిలో గ్రామాస్తులందరూ కలిసి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అయ్యప్ప స్వామి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని రవి కుమార్ యాదవ్ తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుని 41 రోజులు ఎంతో నియమ నిష్ఠలతో పూజలు చేసే స్వాములు , ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలనే గొప్ప ఉద్దేశంతో నిర్వహించే పడిపూజ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.