నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్, మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో.. డివిజన్ ప్రధాన కార్యదర్శి రేపన్ రాజు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యా కల్పన ఏకాంత గౌడ్ మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కారణంతో ఆ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్న చరిత్ర టిఆర్ఎస్ పార్టీదన్నారు. టిఆర్ఎస్, కెసిఆర్ నియంతృత్వ పాలనపై, అందుకే వివేకానంద నగర్ డివిజన్లో బిజెపి నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీహరి యాదవ్, మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్, డివిజన్ బిజెపి సెక్రటరీ దయాకర్ రెడ్డి, ఓబిసి మోర్చా నాయకులు, మార్ల శ్రీను, సంపంగి యాదగిరి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సంధ్య, శాలిని, ఉపేంద్ర, తిరుపతి రెడ్డి, శేఖర్ రావు పాల్గొన్నారు.