కామ్రేడ్ ఓంకార్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలి : చాలి కర్ర దానయ్య

నమస్తే శేరిలింగంపల్లి: ఎంసిపిఐయు వ్యవస్థాపకుడు, అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 14వ వర్ధంతి మియాపూర్ డివిజన్ ఓంకార్ నగర్ లో ఎంసీపీఐయు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రంగస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఎంసీపీఐయు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ కర్ర దానయ్య హాజరై మాట్లాడుతూ.. కామ్రేడ్ ఓంకార్ వర్ధంతి సభలు 31 వరకు జరుగుతాయని, ఆయన ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం అనిల్ కుమార్ ,తాండ్ర కళావతి కె సుకన్య , వల్లే మురళి ఇస్లావత్ దశరథ్ నాయక్ శివాని , బి విమల , లలిత రూతు తిరుపతమ్మ, గ్రేష్ మ్మ, అనిత , సాక్, ఖాదర్ వలీ, జంగయ్య , లాల స్వామి, అబ్దుల్లా, ఎల్లయ్య , హుస్సేన్ , యాదగిరి , శ్రీను పాల్గొన్నారు.

ఓంకార్ నగర్ లో ఎంసీపీఐయు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కామ్రేడ్ ఓంకార్ వర్ధంతిలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కామ్రేడ్ కర్ర దానయ్య తదితరులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here