నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ కాలనీలో రూ. 10 లక్షలతో చేపట్టిన భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను, కాలనీ వాసులు అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రవేశపెడుతున్నారని, కాలనీలలో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో కోట్ల రూపాయలతో చందానగర్ డివిజన్ అభివృద్ధి జరుగుతుందన్నారు. Ghmc పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, కాలని వాసులకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , రాజేష్ రెడ్డి, చిన్నా, నాగమల్లేషరావు, రాములు, మూర్తి, నర్సింహారెడ్డి, అధికారులు AE సంతోష్ రెడ్డి WI సురేందర్, కృష్ణ పాల్గొన్నారు.