నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న అల్ ఇండియా సారీ మేళలో కొలువుదీరిన చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR ) తరపున నాయనికా చౌదరి కథక్ నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో డాక్టర్ జ్యోతి శేఖర్ శిష్య బృందం గణేశా పంచరత్న, జతిస్వరం, వినాయక కౌతం, మండూక శబ్దం, బ్రహ్మాంజలి, అనాధ తాండవం, మరకత మణిమయ, అంశాలను కుమారి గాయత్రీ శేఖర్, సాగరిక, నీతిశ, లక్ష్మి ప్రసన్న, రమ్య రెడ్డి, మీనాక్షి, రేణుక, అక్షర, అన్విత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.