త్రివర్ణ శోభితమైన శేరిలింగంపల్లి – అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు 

  • మియాపూర్ నుంచి చందానగర్ వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ

  • భారతీయులమని గర్విద్దాం.. జాతి సమగ్రతను కాపాడుదాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శేరిలింగపల్లిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి PJR స్టేడియం వరకు 15,000ల మందితో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నోడల్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ & తహశీల్దార్ వంశీ మోహన్, జోనల్ కమిషనర్ శంకరయ్య, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ , శేరిలింగంపల్లి డీసీ వెంకన్న, చందానగర్ డీసీ సుధాంష్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగరావు, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా భారీ ర్యాలీ నిర్వహించారు.

మియాపూర్ – చందానగర్ జాతీయ రహదారిపై త్రివర్ణ పతాకంతో ర్యాలీగా తరలివస్తున్న వేలాదిమంది విద్యార్థులు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు, యువతీ యువకులకు , మహిళలకు, కార్పొరేటర్లుకు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు ,ర్యాలీని విజయవంతం చెయ్యడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులకు , సిబ్బందికి ప్రభుత్వ, ప్రవేటు స్కూల్ యాజమాన్య సిబ్బందికి , పోలీస్ అధికారులకు సిబ్బందికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. 18న స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానించనున్నట్లు వెల్లడి చేశారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ ‘75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై ఏండ్లు స్వీయ అస్థిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.

వేలాది మందితో నిండిపోయిన పీజేఆర్ స్టేడియం

విద్యుత్, నీటిపారుదల, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అన్నిరంగాల్లో యావత్ భారతావనికి దిక్సుచిగా నిలిచిందని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు..ఈ సందర్భంగా భారతీయులమని గర్విద్దాం..జాతి సమగ్రతను కాపాడుదాం.. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను 3 రోజులపాటు ఘనంగా నిర్వహించుకుందాం.. జాతి నిర్మాతల త్యాగాలను స్మరించుకుందాం అని ప్రభుత్వ విప్ గాంధీ పిలుపునిచ్చారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే వారి మాటలను నమ్మకండి. రేపటి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్ర ఎంతో గణనీయమైనదని ఆదినుంచి విభిన్న జాతులు, విభిన్న మతాలు, వివిధ సంస్కృతులు, సంప్రదాయాలతో మిళిత సాంప్రదాయ మనదని అన్నారు.

PJR స్టేడియంలో బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులు

ఓర్పు , సహనం తో నాటి హైదరాబాద్ నేటి తెలంగాణ ప్రజల ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం గా ప్రసిద్ధి చెందినదని, భారత దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న ప్రాంతం హైదరాబాద్ ఒక మినీ భారతదేశంను తలపిస్తుంది అనడంలో అతిశయోక్తి  లేదని కీర్తించారు. బ్రిటిషు పరిపాలన అనంతరం స్వాతంత్ర భారతంలో ఐక్యమయిన శుభపరిణామాలను నెమరువేస్తూ ఈ నాటి సంబరాలు జరుపుకుంటున్నాం. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య పాలన ను ప్రజలు అఖండ భారతంలో ఐక్యం కావడానికి చూపిన ఆనంద గడియలివి, ఈ నాడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా శుభపరిణామని ప్రభుత్వ విప్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు.

జాతీయగీతం ఆలపిస్తూ సెల్యూట్ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు, నాయకులు

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని, ఇది మనందరికి గర్వకారణమన్నారు. చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి , ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ, GHMC అధికారులు, ఇతర శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది, సీఐలు తిరుపతి రావు, క్యాస్ట్రో రెడ్డి, కాంత రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్లు మాన్వి, ఉష రాణి, మండల విద్యాధికారి వెంకటయ్య, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, ఆయా డివిజన్ల అధ్యక్షులు విద్యార్థులు, మహిళలు, యువకులు, ప్రజలు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న వారికి పీజేఆర్ స్టేడియంలో భోజనం వడ్డిస్తున్నా విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here