దళితులు తలెత్తుకుని బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయం  – ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ద‌ళితుల జీవితాల్లో వెలుగులు నిండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, సీఎం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. దళిత బంధు కార్యక్రమంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారుడు కేశవులుకు మంజూరైన కిరణా షాపును వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఈ.శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సయ్యద్ గౌస్, రాజు ముదిరాజ్, కృష్ణగౌడ్, నాయీమ్, వార్డ్ సభ్యులు రామచందర్, స్థానిక నాయకులు తైలి కృష్ణ, రంగా స్వామి, సుధాకర్, తర్య నాయక్, నర్సింగ్ నాయక్, కృష్ణ ముదిరాజ్, నర్సింహ ముదిరాజ్, బాలరాజు, స్వామి, అలీం, శ్రీను నాయక్, మహిళలు వెంకటమ్మా, సువర్ణ, సుల్తానమ్మ పాల్గొన్నారు.

లబ్ధిదారుడు కేశవులుకు మంజూరైన కిరణా షాపును ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ 
ప్రారంభించిన కిరాణా షోప్ లో కార్పొరేటర్ జగదీశ్వర్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు, వార్డ్ సభ్యులు, లబ్ధిదారుడుతో ఎమ్మెల్యే గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here