ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో వరదనీటి సమస్యను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం పరిశీలించారు. స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో ప్రధాన రోడ్డు కంటే అంతర్గత రహదారి దిగువన ఉండటంతో వరద నీరు నిలిచి ఇబ్బందికరంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని జిహెచ్ఎంసి సిబ్బందితో వరదనీటి తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షం అనంతరం శాశ్వత పరిష్కారంగా నీరు నిలవకుండా వరద నీరు సాఫీగా వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ గౌడ్. డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, నాయకులు యాదగిరి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.