చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులుతో కలిసి పరిశీలించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ ప్రధాన రహదారి, అన్న పూర్ణ ఎనక్లేవ్ కాలనీ లలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతములో పర్యటించి, అధికారులు చేపడుతున్న సహాయక చర్యల అర్ధరాత్రి వరకు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ పనులలో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి పనులను వెంటనే చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆయన సూచంచారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలపై నిర్లక్ష్యం తగదని ,ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అందరు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్రంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేయాలనీ, ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని, ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఎక్కడ ఏ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. అదేవిధంగా వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వెంట ఈ ఈ చిన్నా రెడ్డి డీఈ రూప దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, మియపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
How to message local problems to namasteslp;
Whatsapp number pl