– అసెంబ్లి ముట్టడికి యత్నించిన శేరిలింగంపల్లి బిజెపి నేతల అరెస్ట్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ను తక్షణమే రద్దుచేయాలని, గ్రేటర్ లో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా అర్భన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆద్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లికి చెందిన బిజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ వద్దకు చేరుకోగా పోలీసులు అరెస్ట్ చేసి వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా పోలీసుల చర్యలను బిజేపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డి శేరిలింగంపల్లి నాయకులు మొవ్వా సత్యనారయణ, బుచ్చిరెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, చింతకింది గోవర్ధన్ గౌడ్, శివకూమార్లు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రజల నడ్డి విరుస్తూ ఎల్ఆర్ఎస్ రుసుం వసులు చేసే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు హర్షించరని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో శేరిలింగంపల్లి బిజెపి నాయకులు వసంత్ కుమార్ యాదవ్, నందనం విష్ణుదత్, హరిప్రియ, వరప్రసాద్, రవిగౌడ్, చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, చంద్రమోహన్, అశోక్ తదితరులున్నారు.