నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ లో 6 వేల మట్టి వినాయకుల పంపిణీ సంతృప్తినిచ్చిందని మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి బొబ్బ నవత రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ లోని శ్రీ రాం నగర్ కాలనీ, లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపర్ట్మెంట్, కొమరం భీమ్ నగర్ లో ఉన్న శ్రీ పద్మావతి అపర్ట్మెంట్, దీప్తి శ్రీ నగర్ సత్యనారాయణ ఎన్క్లేవ్ అపర్ట్మెంట్ లలో ఉచిత మట్టి వినాయకులను ఆమె పంపిణీ చేేేేశారు.
ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా చందానగర్ డివిజన్ లో సుమారు 25 కాలనీ లలో,30 అపర్ట్మెంట్లలో సుమారు 6000 వేల మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి సహకారంతో 4000 వేలు, G. Y ఫౌండేషన్ చైర్మన్ గజ్జల యోగనంద్ సహకారం తో 1000, సందయ్య ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి రవి కుమార్ యాదవ్ సహకారంతో 1000, ఒక ఫీట్ మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా 4 ఫీట్ల ఎత్తు ఉన్న 8 మట్టి వినాయకులను కూడా ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఇట్టి వినాయకుల పంపిణీ ఉచితంగా పంపిణీ చేయటానికి సహకరించిన బొబ్బ విజయ్ రెడ్డి, గజ్జల యోగనంద్, భిక్షపతి యాదవ్, రవి కుమార్ యాదవ్ లకు ప్రజల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో సహకరించిన కాలనీ అసోసియేషన్ వారికి, అపార్ట్మెంట్ ఆసోసియేషన్ వారికి, బస్తి వాసులకు, బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు.