నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్ధనల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, సీఐ సుమన్, మియపూర్ సీఐ తిరుపతి రావు, ఎస్ఐ రవి కిరణ్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ అన్ని పండగలను గొప్పగా నిర్వహిస్తున్నారని, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
మైనారిటీ ప్రజలు ప్రభుత్వానికి నిరంతరం అండగా ఉండాలని, విశ్వమానవ శాంతి కోసం జరిగే రంజాన్ ప్రార్థనల ద్వారా అల్లా దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసి, అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ సాంబశివరావు, మైనారిటీ నాయకులు మునఫ్ ఖాన్, లియాకత్, రహీం, బాబూమియా, సలీం, మియన్, అంకా రావు, రాములు యాదవ్, ఖాజా, శైలేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.