నమస్తే శేరిలింగంపల్లి: ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్, వాసవి హైటెక్ నవ నిర్మాణ్ చందానగర్ అధ్యక్షుడు పసుమర్తి శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందించిన తెలుగు నూతన సంవత్సర పంచాంగాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీనివాస్ గుప్త, బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ గజ్జల యోగానంద్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీప్తి శ్రీ నగర్ లోని ధర్మపురి క్షేత్రంలో ఏర్పాటు చేసిన పంచాంగం ఆవిష్కరణలో 200 మందికి పైగా ఆర్య వైశ్యులకు పంచాంగం పుస్తకాలను అందజేశారు. చందానగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా, శేరిలింగంపల్లి ఆర్యవైశ్య ఐక్య వేదిక కన్వీనర్ వెలగా శ్రీనివాస్, శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు గంపా సత్యనారాయణ, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉట్కురి శ్రీనివాస్, శేరిలింగంపల్లి అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మారం వెంకట్, నటరాజ్, మాశెట్టి ప్రభాకర్, పవన్, వనమా శ్రీనివాస్, ఐవీఎఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వైస్ జనరల్ సెక్రటరీ ముత్యాల శ్రీను, చందానగర్ ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్, ట్రెజరర్లు జయ కృష్ణ, పబ్బా శ్రీనివాస్, సత్యనారాయణ, నాగరాజు, దినేష్, శ్రీధర్, భరత్, సుదీర్, కౌశిక్, మల్లికార్జున, శ్రీనివాస్, వాసవి క్లబ్ చందానగర్ సెక్రటరీ వెంకయ్య గుప్తా, కోశాధికారి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.