నమస్తే శేరిలింగంపల్లి: పీఆర్ కే చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలుగు నూతన సంవత్సరమైన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగంను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో జీవించాలని ప్రభుత్వ విప్ గాంధీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.కె చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ సేవ రత్న పోలా వాణి కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అంతి రెడ్డి, కట్ట రవి, లయన్స్ క్లబ్ ఆర్ సీ సత్యనారాయణ, వాసా రఘు, చంద్రమోహన్, సంపత్, సత్యనారాయణ, పెండ్యాల నాగరాజు, పి.ఆర్.కె చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.