వరి కొనడం ఆపితే కేంద్ర ప్రభుత్వానికి రైతుల ఉసురు ముడుతుంది – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:బిజెపి కేంద్ర ప్రభుత్వం వరి కొనడం ఆపేస్తే రైతుల ఉసురు ముడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల బిజెపి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా మియాపూర్ ఎక్స్ రోడ్డు జాతీయ రహదారిపై మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దహనం చేశారు. తెలంగాణ యాసంగి వడ్లు బిజెపి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గంగాధర్ రావు, డివిజన్ అధ్యక్షుడు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, సీనియర్ నాయకులు పురుషోత్తం యాదవ్,
హన్వార్ షరీఫ్, మోహన్ ముదిరాజ్,మహేందర్ ముదిరాజ్, గోపరాజు శ్రీనివాస్, మాధవరం గోపాల్ రావు, చంద్రిక ప్రసాద్ గౌడ్, ఖలిదిండి రోజా,సుప్రజ, రాణి, స్వరూప, స్వామి నాయక్,సుధాకర్, కోటయ్య, ఏడుకొండలు, సంతోష్, శ్రీధర్ ముదిరాజ్, దయానంద ముదిరాజ్, రాజు ముదిరాజ్, అశోక్ వెంకటేష్, రవి గౌడ్, మోహిన్, శివముదిరాజ్, రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, రమేష్, అబ్రహం, సంతోష్, ప్రభాకర్, ప్రసాద్, దేవేందర్, సతీష్, నర్సింగ్, చందు,‌ నరేష్ చిన్న,జగదీష్,మియాపూర్ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, టీఆర్ఎస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ ఎక్స్ రోడ్డులో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here