బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా గీతా సెల్ కన్వీనర్ గా రవిగౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా అర్బన్ గీతా సెల్ కన్వీనర్ గా హఫీజ్ పేట్ డివిజన్ కు చెందిన టి.రవి గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని రవి గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ విధానాలకు అనుగుణంగా బాధ్యతగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ గీతా సెల్‌ కన్వీనర్ గా నియమించిన జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, రాష్ట్ర, జిల్లా అసెంబ్లీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా కోశాధికారి రమేష్ సోమిసెట్టి, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర రావు పాల్గొన్నారు.

రవి గౌడ్ కు నియామకం పత్రాన్ని అందజేస్తున్న సామ రంగారెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here