నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకం అయిన గరికపాటి రామ్ మోహన్ రావు ను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గరికపాటి రామ్ మోహన్ రావుకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా గరికపాటి నియామకవడం సంతోషకరమని రవికుమార్ యాదవ్ అన్నారు. బిజెపిలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. గరికపాటి నియామకంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ గరికపాటి రామ్ మోహన్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.