నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ చేపలు, మాంస విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోకుల్ ప్లాట్స్ తో పాటు పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో గోదావరి కట్స్ నూతన శాఖను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. సరసమైన ధరలకు, నాణ్యమైన, రుచికరమైన చేపలను విక్రయించి ప్రజల మనస్సు గెలవాలని, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు విక్రయించి వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి, సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్ , పితాని శ్రీనివాస్, అప్పరావు, శివాజీ, సాంబయ్య, ప్రభాకర్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






