రోడ్డు విస్తరణ తగ్గించి న్యాయం చేయండి : ప్రభుత్వ విప్ గాంధీకి విన్నవించిన పీజేఆర్ నగర్ సంక్షేమ సంఘం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి ప్రధాన రోడ్డు విస్తరణ లో భాగంగా పీజేఆర్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు రోడ్డు విస్తరణ ను 200 ఫీట్ల నుండి 150 ఫీట్ల వరకు తగ్గిచాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీజేఆర్ సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ మీనాక్షి టవర్స్ నుండి ప్రాంతం నుంచి గచ్చిబౌలి ప్రధాన రహదారి పై వెళ్లేందుకు అక్కడి నుంచి మీనాక్షి టవర్స్ రోడ్డు కు చేరుకునేందుకు గచ్చిబౌలి ప్రధాన రహదారి పై వంతెనకు ర్యాంపుల నిర్మాణం జరగనుందన్నారు. ఓఆర్ఆర్ మధ్యలో నుంచి మరో పై వంతెన మొదలవుతుందన్నారు. అది గచ్చిబౌలి పై వంతెన మీదుగా వెళ్లి ర్యాడ్సన్ వద్ద ముగుస్తుందన్నారు. గచ్చిబౌలి ప్రధాన రహదారి విస్తరణ వలన మా ఆస్తులకు భంగం కలిగి తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. రోడ్డు విస్తరణను 200 ఫీట్ల విస్తరణ నుండి 150 ఫీట్ల వరకు తగ్గించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పీజేఆర్ సంక్షేమ సంఘం సభ్యులు వినతి పత్రం ద్వారా కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. అందరికి అనుకూలంగా రోడ్డు విస్తరణకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చాంద్ పాషా, పీజేఆర్ సంక్షేమ సంఘం సభ్యులు కైలాష్ సింగ్ , అచేశ్వర్ రావు, దుర్గా ప్రసాద్, సయ్యద్ షౌకత్ హుస్సేన్, రంగరావు, సంకేశ్ సింగ్, కృష్ణ గౌడ్, ఎండీ రియాజుద్దీన్, పౌల్ ప్రకాష్, శైలేందర్ సింగ్, మహమ్మద్ అబ్దుల్ అజిజ్, పీవీ రాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీకి వినతిపత్రం అందజేస్తున్న ‌పీజీఆర్ సంక్షేమ సంఘం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here