జెండా పండగను జయప్రదం చేయండి: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచనల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్ 2 న ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ జెండాను ఎగరవేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ పిలుపునిచ్చారు. ఆయా డివిజన్లలో, కాలనీలలో కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు అంగ రంగ వైభవంగా గులాబీ జెండా పండుగను నిర్వహించాలన్నారు.కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు అందరూ పాల్గొని టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here