బ‌ల్దియా బయోడైవర్సిటీ కమిటీ సభ్యురాలిగా కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

మొక్కతో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బ‌ల్దియా బయోడైవర్సిటీ కమిటీ సభ్యురాలిగా చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి నియ‌మితుల‌య్యారు. కేంద్ర ప్రభుత్వ బయోలాజికల్ యాక్టు ప్రకారం తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్ లో పర్యావరణాన్ని పెంపొందించడానికి తెలంగాణ రాష్ట్ర బయోడైవర్శిటీ బోర్డు నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 21 ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్,సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 22(I ఆఫ్ దా బయోలాజికల్ ఆక్ట్ 2002 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్యం జీవో నెం 23 ఈఎఫ్ఎస్ ఆండ్‌ సెక్షన్ 63 (1) బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్‌ 2002.) జీహెచ్ఎంసీ బయోడైవర్సిటీ కమిటీ మేయర్ బొంతు రామ్మోహన్ చైర్ పర్సన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అర్బన్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ లో సభ్యురాలు గా చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి జిహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్ కమిషనర్ వీ. కృష్ణ సెక్రటరీగా వ్యవహరించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యురాలుగా రాష్ట్ర ప్రభుత్వం తనను నియమించడం ఎంతో గర్వంగా ఉందని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని కార్పొరేటర్ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ తనకు ఎంతో ఇష్టమని కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత శాలువాలు, పూలమాలు, సత్కారాలు, సన్మానాలకు దూరంగా ఉంటూ మొక్కలను మాత్రమే బహుకరిస్తున్నానని, అదే విధంగా ప్లాస్టిక్ నిషేధం మరియు మట్టి వినాయకుల ప్రతిష్టించడానికి కృషి చేస్తున్నాన‌ని కార్పొరేటర్ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తున్నానని అదే విధంగా గ్రేటర్ హైద్రాబాద్ లో పర్యవరణ పరిరరాక్షణకు కృషి చేస్తాన‌ని అన్నారు. త‌న‌ను న‌మ్మి ఈ భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి సబితా ఇందిరా రెడ్డి, ఎం.పి రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బ‌ల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ల‌కు ఆమె ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here