నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్రలో బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు పాలుపంచుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ శివాలయం నుంచి శుక్రవారం జన ఆశీర్వాద యాత్రకు వాహనాల్లో ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భాగ్యనగర్ నందనవనం వద్ద కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే యాత్ర లక్ష్యంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జీ. కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర చేపట్టారని అన్నారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో జిల్లా, సీనియర్ నాయకులు ఉన్నారు.