శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): రాజా రాజేశ్వరి, శ్రీరామ్‌నగర్, కొండాపూర్ ప్రాంతాల్లో తాను వ్యక్తిగతంగా బాకీ కార్డులను పంపిణీ చేసినట్లు బీఆర్ఎస్ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావహుడు మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ తెలిపారు. పంపిణీ చేసిన కార్డులను ట్రాకింగ్ కోసం ప్రజలు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాస్తవంగా ఎప్పుడు అమలు చేస్తుందో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హామీల అమలుపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక బాకీ కార్డు అందుకోలేకపోయిన వారు ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ తెలిపారు.






