నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం శ్రీవారి జన్మ నక్షత్రం, శ్రవణానక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీపద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిపించారు. మధ్యాహ్నం స్వామివారికి అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ పాలకమండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి కల్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
