శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్లోని శేరిలింగంపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథ మండపంలో సోమవారం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు పూజా కార్యక్రమానికి చందానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై నిర్వాహకులకు సీఐ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి యూత్ అసోసియేషన్ సభ్యులతోపాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.






