ఘ‌నంగా బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు అట్టేపల్లి రామప్రభు, సిద్దనబోయిన పురుషోత్తం యాదవ్‌లు కిరణ్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ యాదవ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొబ్బ నవతా రెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ్, కొంచ శివరాజ్, చంద్రిక ప్రసాద్, కలిదిండి రోజా, వరలక్ష్మి, పిల్లి నాగరాజు, వేముల రాజశేఖర్, సోంటెనా గంగాధర్, అట్టేపల్లి ప్రశాంత్, అడప అజయ్ తదితరులు పాల్గొని కిరణ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here