మాధవ బృందావన్ అపార్ట్‌మెంట్‌లో ఘనంగా గణేష్ పూజ.. పాల్గొన్న అసోసియేషన్ ప్రతినిధులు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాధవ బృందావన్ అపార్ట్‌మెంట్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి తాడూరుతోపాటు అసోసియేషన్ సభ్యులు, కేఎస్‌టీవీ చైతన్య, శామల్ రావు, అపార్ట్‌మెంట్ వాసులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలుచుకుని, ఉత్సవాలు సంతోషకర వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here