నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా పని చేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి గురువారం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, స్థానికంగా నెలకొన్న సమస్యలను బస్తి సభ్యులతో కలిసి పరిశీలించారు. మంజూరైన పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కసిం, సుభాష్ చంద్ర బోస్ నగర్ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముక్తార్, వార్డ్ సభ్యులు రహీమ్, నాయకులు బబుమియ, లియాఖత్, సలీం, షోయబ్, మునాఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.