నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కోవిడ్ మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో గురువారం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, గంగుల గణేష్ యాదవ్, సర్వర్, శ్యామ్, వార్డ్ సభ్యులు రాంచందర్, హుస్సేన్, జీహెచ్ఎంసీ హెల్త్ ఆఫీసర్ కార్తిక్, హఫీజ్ పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.