నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ మయూరి నగర్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సక్రమ్ నాయక్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు బదిలీపై వెళ్తున్న సక్రమ్ నాయక్ ను గురువారం శాలువాతో సన్మానించారు. ఆల్ ఇండియా బంజారాసేవ సంఘ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ మూడేళ్లుగా అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసిన సక్రమ్ నాయక్ తన పరిధిలోని పేద బస్తీలలో ఎలాంటి విద్యుత్ మీటర్లు , ట్రాన్స్ ఫార్మర్ సమస్యలు ఉన్న సత్వరమే పరిష్కరించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారన్నారు. ప్రజా సేవే పరామవధిగా భావించే అధికారి సక్రమ్ నాయక్ గారు బదిలీ కావడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాయిని రత్న కుమార్ , రెడ్యానాయక్, నర్సింహా, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు.